Religious
మంగళవారం రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని తినాలి
Kalinga Times : మంగళవారం రోజున హనుమంతునికి ఉపవాసం ఉండి స్వామివారికి భక్తిలో పూజలు చేస్తుంటారు. మరి మంగళవారం హనుమంతునికి పూజ చేయడం వలన కొత్తగా పెళ్లయిన దంపతుల్లో ఏవైనా దోషాలు అలానే వారిలో దుష్ట శక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారు. ఈ మంగళవారం రోజున మాత్రం రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని తినాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది.మంగళవారం రోజున ఎరుపురంగు దుస్తులు ధరించి స్వామివారికి ఎరుపురంగు పువ్వులతో పూజలు చేయాలి. ఇలా చేయడం వలన స్వామివారి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా శనిగ్రహదోషాలు ఉంటే పోతాయి. కొందరైతే ఎప్పుడూ చూసిన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుని పూజిస్తే తప్పక ఆరోగ్యం బాగుపడుతుంది.