Telangana

సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు కృష్ణపై సోషల్ మీడియాలో వార్

Kalinga Times ; కాగజ్ నగర్‌ ఏరియాలో ఆదివారం నాడు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు కృష్ణపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. అటు సీఎం కేసీఆర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు 16 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదలావుంటే తమ్ముడిని రక్షించే ప్రయత్నంలో ఎమ్మెల్యే కోనప్ప సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపింది. అటవీశాఖ సిబ్బందిపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కోనప్ప. ఆ మేరకు గ్రామస్తులకు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో పూసగుచ్చినట్లు వివరిస్తున్న వీడియో ఒకటి బయటకు రావడం సంచలనం సృష్టించింది. అధికారులదే తప్పంతా అనే విధంగా మీడియా సమావేశంలో చెప్పాలని ఎమ్మెల్యే చెబుతుండటం మరో వివాదానికి కారణమైంది.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ ఆఫీసర్ అనిత మీడియాతో మాట్లాడారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కోనేరు కుటుంబసభ్యులు తనను బెదిరించారని ఆమె తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నన్ను ఏం చేస్తారోనని భయం వేస్తోందని ఆమె అన్నారు. మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోయారు. మీడియాతో మాట్లాడుతనూనే అనిత కన్నీరు పెట్టుకున్నారు. తనతోపాటు తన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని కోరారు. యూనిఫాం ని నమ్ముకునే తాను ఆ ఉద్యోగంలోకి వచ్చినట్లు చెప్పారు.

from KIMS Hospital..ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ #అనిత గారు మీడియాతో…..

Pulse of Telangana ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಸೋಮವಾರ, ಜುಲೈ 1, 2019

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close