Religious
శివుని హృదయం భావోద్వేగాల గని
Kalinga Times :శివుని భోళాశంకరుడు అని పిలవడం జరుగుతుంది, అనగా మనసు నిండా పరమేశ్వరుని నింపుకుని ద్యానించిన ఎడల, మిగిలిన దేవుళ్ళతో పోల్చినప్పుడు అతి తక్కువ కాలంలోనే శివుని సంతోషపరచవచ్చునని చెప్పబడింది. క్రమంగా కొన్ని శ్లోకాలు, అర్పణలతోనే శివ కటాక్షం సిద్దిస్తుందని భక్తుల విశ్వాసం. శివుని హృదయం భావోద్వేగాల గనిగా చెప్పబడుతుంది. క్రమంగా భక్తులకు ఎటువంటి కష్టం కలుగనీయకుండా, వారి కోర్కెలను తీరుస్తూ కాపాడుతూ ఉంటాడని విశ్వాసం. అందుకే శివుని భోలే నాథ్ అని కూడా పిలుస్తారు. క్రమంగా నిజమైన భక్తి ప్రపత్తులతో కొన్ని ప్రత్యేకించబడిన మంత్రాలతో ఆరాదించే భక్తులను నిరాశపరచకుండా, వారి కోరికలను నెరవేర్చే కొంగు బంగారంగా కీర్తించబడుతాడని చెప్పబడింది