Telangana
హరీష్‌రావుకు మళ్లీ ప్రాధాన్యత
Kalinga Times,హైదరాబాద్: టీఆర్ఎస్‌లో హరీష్‌రావుకు మళ్లీ ప్రాధాన్యత పెరిగిందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితం పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కేసీఆర్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కేసీఆర్ తర్వాత ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు సభ్యత్వం తీసుకొన్నారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి హరీష్‌రావును పిలిచి మరీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి తనతో పాటు హరీష్ రావు టీఆర్ఎస్ బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్‌లో హరీష్‌రావుకున్న ప్రాధాన్యతను తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల ఓటమిలో హరీష్ రావు కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు కేవలం మెదక్ పార్లమెంట్ స్థానానికే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌ను పక్కన పెట్టారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని హరీష్ రావు ఖండించారు