Kalinga Times ,హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని టీమిండియా అధికారిక అపరెల్ స్పాన్సర్ నైకీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీలు వేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు కొత్తగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ ఆరెంజ్ కలర్ జెర్సీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆరెంజ్, నీలి రంగు కాంబినేషన్లో కొత్త డ్రెస్ చాలా బాగుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ ఈ జెర్సీకి రూపకల్పన చేసింది. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని డిజైన్ చేశారు. ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమిండియా ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది.
Special occasion, special kit 👌 #TeamIndia will wear this in their #OneDay4Children game against England on Sunday. #OD4C | #ENGvIND | #CWC19 pic.twitter.com/ZvuX4be37F
— ICC (@ICC) June 29, 2019
టీమిండియా నారింజ రంగు జెర్సీ ఎందుకంటే!
ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా…. ఇటీవలే శ్రీలంక సైతం తన జెర్సీని మార్చుకున్న సంగతి తెలిసిందే.