Film
బిగ్‌బాస్ మూడో సీజన్ హోస్ట్‌గా హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ మూడో సీజన్‌ను నడిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన లోగో లాంచ్ టీజర్, హోస్ట్ టీజర్ ఫిల్మ్‌తో విపరీతమైన క్రేజ్ లభించింది. భారీగా అంచనాలు నెలకొన్నాయి అని స్టార్ మా ప్రకటనలో పేర్కొన్నది. అద్భుతమైన వినోదాన్ని అందిస్తాం బిగ్‌బాస్ మూడో సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్టార్ మా తెలుగు బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తామని మా ప్రేక్షకులకు మాట ఇస్తున్నాం. ఇప్పటి వరకు విశేషంగా ప్రేమను కురిపించి ఆదరణ చూపించారు. ఎలాంటి వివాదం లేకుండా మమ్మల్ని అతిపెద్ద తెలుగు టెలివిజన్ బ్రాండ్‌గా ఆశీర్వదించారు అని అన్నారు.
బిగ్‌బాస్ 3 షోకు నాగార్జునను హోస్ట్‌గా అందించేందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. విలక్షణమైన స్టయిల్‌కి పర్యాయపదం, మంచితనానికి నిర్వచనం, నాలెడ్జికి నిదర్శనంగా తీర్చి దిద్దేందుకు ఈ షోను నాగార్జున మరింత ఎనర్జిటిక్‌గా మార్చబోతున్నారు. వినూత్నమైన అనుభూతిని కలిగించబోతున్నాడు అని అలోక్ జైన్ వెల్లడించారు.
బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించడంపై నాగార్జున మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో అనేక ప్రయోగాలు చేశాను. నా కెరీర్‌లో ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఉన్నాయి. నాకు టెలివిజన్ కొత్త కాదు. బిగ్‌బాస్ లాంటి షో చేయడం కొత్త అనుభూతి. ఇలాంటి షో లో నేను ఓ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ుంది. ఈ కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు.