Kalinga Times,అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ మిషాల్ కిర్పాలానీతో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఇంటర్నెట్లో ఇందడి చేస్తున్నారు. తాజాగా ఇరా ఖాన్ తన ప్రియుడితో రొమాంటిక్ స్లో డాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. సాధారణ పిల్లలతో పోలిస్తే సినీ సెలబ్రిటీల పిల్లలకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే. ఈ జనరేషన్ సెలబ్రిటీ కిడ్స్ ఇలాంటి విషయాలను ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకోవడంలో ముందుంటున్నారు.
మిషాల్ రొమాంటిక్ స్లో డాన్స్ స్నేహితులతో కలిసి ఓ బార్లో పార్టీ చేసుకుంటున్న వీరు… అక్కడ జార్జ్ స్ట్రేట్స్ సాంగ్ ‘ఐ జస్ట్ వాంట్ టు డాన్స్ విత్ యు’ బాణీలకు తగిన విధంగా స్లో డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు తాను మిషాల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం ఇరా ఖాన్ గత వాలంటైన్స్ డే సందర్భంగా అఫీషియల్‌గా వెల్లడించిన సంగతి తెలిసిందే. మిషాల్ కిర్పాలానీ ఒక మ్యూజీషియన్. వీరు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ సినిమా రంగానికి చెందిన వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు.