Andhra PradeshTelangana

రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి

Kalinga Times ,హైదరాబాద్: హైద్రాబాద్‌ ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో నదుల నీటిని సమర్ధవంతంగా వాడుకొనే విషయమై చర్చించారు. గోదావరి, కృష్ణా నదిలో నీటి లభ్యతపై తెలంగాణ సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితిని వివరించారు. ఏ రాష్ట్రం ఏ నదిపై ఎక్కడ అక్రమంగా బ్యారేజీలు నిర్మించిందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా కేసీఆర్ తెలిపారు.

సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో చూపారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు , తాగు నీటి సమస్య తీరే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతందని కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

భోజన విరామంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మా ఇద్దరి మధ్య బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేం. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధిస్తాం. జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధాల్లో గుణాత్మక మార్పు వస్తుంది. రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకెళ్తాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close