Telangana
తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె లాగా
Kalinga Times,హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్మీట్ పెట్టిన ఆయన అప్పులలో తెలంగాణ ఉంటే అట్టహాసంలో కేసీఆర్ ఉన్నారు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె లాగా కేసీఆర్ అసెంబ్లీ కోసం భవనాలు కడుతున్నారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ అన్నారు.. ఇప్పుడు సచివాలయం నిర్మాణం అంటున్నారు. ఏక పక్షంగా పోతే కేసీఆర్ తను తీసుకున్న గోతిలో తానే పడతారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు పడుతూ సీపీఐ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది” అని చాడ వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.