Andhra Pradesh
జగన్పై నారా లోకేష్ వరుస ట్వీట్లతో
Kalinga Times అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్పై నారా లోకేష్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్ర వేయాలనే ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతోందని లోకేష్ అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో ఏ 1 ముద్దాయి అవినీతిపై విచారణకు కమిటీ వేయడమా ఏ 2 ముద్దాయి విచారణ నిర్వహిస్తారా అని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ.2636 కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. బట్ట కాల్చి మీద వేశారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హాయంలో విద్యుత్ శాఖను ఆదర్శంగా నిలిపినట్టుగా లోకేష్ చెప్పారు. రూ. 36 వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. 13 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. విద్యుత్ రంగంలో తమ సర్కార్ తెచ్చిన ఫలితాలకు గాను 150కు పైగా అవార్డులు వచ్చాయన్నారు.
నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత @ncbn గారి పై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది
— Lokesh Nara (@naralokesh) June 28, 2019
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా?
— Lokesh Nara (@naralokesh) June 28, 2019
తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
— Lokesh Nara (@naralokesh) June 28, 2019
అన్నయ్యలూ నాకేం తెలియదంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి @ysjagan గారు.
— Lokesh Nara (@naralokesh) June 28, 2019