Andhra Pradesh
జైలు జీవితం గడిపిన అర్హత ఉండాలని ప్రజలు తీర్పు
Kalinga Times : టీడీపీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్టీఓ సంఘ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఏపీకీ ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వారు జైలుకు వెళ్లిన అర్హత ఉండాలని ప్రజలే తమ ఓట్ల ద్వారా నిరూపించారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పైన అవినీతి ముద్ర వేసేందుకే జగన్ విచారణ ప్రారంభించారని ఆ అవినీతిలో అధికారులే కీలక పాత్ర ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసారు. దీని పైన ఒక టీవీ చర్చలో టీడీపీ ప్రతినిధిగా పాల్గొన్న అశోక్‌బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీకీ ముఖ్యమంత్రి కావాలంటే జైలు జీవితం గడిపిన అర్హత ఉండాలనే విధంగా తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానిం చారు. అశోక్‌బాబు ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆ వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తున్నారు. ఇప్పుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఫైర్ అవుతు న్నారు. ఉద్యోగసంఘ నాయకుడిగా ఉన్న సమయం నుండి అశోక్‌బాబు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో ఓటర్ల తీర్పు పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.