Andhra Pradeshsocial
జూనియర్ ఆర్టిస్ట్ లలిత(27) అదృశ్యం
Kalinga Times : సినిమాలపై మక్కువతో నగరానికి వచ్చి హాస్టల్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ టీవీ సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న లలిత(27) అదృశ్యమైంది. ఈ ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి హాస్టల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఓబుల్ నాయల్ గ్రామానికి చెందిన లలిత అదే గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ కూతురు ఉంది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త నుంచి వేరుపడి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. 8 నెలల క్రితం నగరానికి చెందిన నాని అనే వ్యక్తి టీవీ సీరియళ్లలో నటించేందుకు అవకాశం ఇప్పిస్తానని లలిత తల్లిదండ్రులతో మాట్లాడాడు. దీంతో లలిత తండ్రి నారాయణ స్వామి ఆమెను రాజరాజేశ్వరి హాస్టల్‌లో చేర్పించి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాని హాస్టల్‌కు వచ్చి లలితను షూటింగ్‌లకు తీసుకువెళ్లేవాడు. మొదట్లో హాస్టల్ అద్దెను సక్రమంగానే చెల్లించిన లలిత రెండు నెలలుగా డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. దీంతో హాస్టల్ నిర్వాహకులు లలితపై ఒత్తిడి పెంచారు. సీరియళ్లలో నటిస్తున్నా డబ్బులు రాకపోవడంతో హాస్టల్‌కు వెళ్లడం మానేసింది. రోజూ ఫోన్‌లో ధర్మవరంలో ఉంటున్న తల్లిదండ్రులతో మాట్లాడుతుండేది. చివరిసారిగా ఈ నెల 17న ఫోన్‌లో మాట్లాడి మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో లలిత కుటుంబ సభ్యులు హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడగా తమకు రెండు నెలలుగా అద్దె చెల్లించకుండా బయటనే ఉంటోందని సమాధానం ఇచ్చారు. వెంటనే చిన్న కూతురుతో కలిసి తండ్రి నారాయణస్వామి ఎస్సార్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి నాని కోసం గాలిస్తున్నారు. లలిత ఈటీవీ, మాటీవీ, జీ టీవీల్లో వచ్చే ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణఖడ్గం అనే సీరియళ్లలో జూనియర్ ఆర్టి్‌స్టగా పనిచేస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.