Telangana
కరీంనగర్ లో వ్యభిచార గృహాలపై మెరుపు దాడులు
Kalinga Times : కరీంనగర్ లోని కొన్ని ఇళ్లలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ఆదివారం నాడు రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులు, మహిళలను అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని టూ టౌన్ పోలీసుస్టేషన్ లో మూడు కేసులను నమోదు చేశారు.
కరీంనగర్ నగరంలోని రైతుబజార్, కాపు వాడ, కొత్త యసువాడ, భగత్ నగర్ , మూకారంపుర , మంకమ్మతోట , సప్తగిరి కాలనీ , కాన్సర్ హాస్పిటల్ ప్రాంతం , ఆదర్శనగర్ , లక్ష్మినగర్ సంతోష్ నగర్ , మరియు రేకుర్తి ప్రాంతాలలో ఉన్న వ్యభిచార గృహాలపై నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు కరీంనగర్ టౌన్, కొత్తపల్లి స్టేషన్లకు చెందిన 50 మంది పోలీస్ సిబంది 13 టీం లుగా ఏర్పడి ఒకేసారి నిర్వాహుకుల , నివాసాలపై దాడి చేసి విటులు , మరియు యువతులు (బాదిత మహిళలు ) అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో గోస్కుల శంకర్ ,r/o సుల్తానాపూర్డి,శ్రీనివాస్ రెడ్డి, r/o కరీంనగర్డి,కొండ నాగరాజు, r/o పెద్దపల్లి , దురిశెట్టి రమేష్ , కరీంనగర్ కాగా నిర్వాహకులు అఫ్రెన్,r/o కరిమనగర్, బొడ్ల జగదీష్, r/o కరీంనగర్. నగునూరి భానుప్రియ, r/o కరీంనగర్.ఫర్వ్ న్ పతిమా, r/o కరీంనగర్.అలువాల స్వరూప, r/o కరీంనగర్ లు ఉన్నారు. వారి నుండి 15 మొబైల్ ఫోన్స్ 1 కార్ , 1 యాక్టీవ్ , 1స్కూటీ 1 tvs బైక్ , క్యాష్ 27,760/- స్వాధీనం న్నారు.అనంతరం వారి ఫై కరీంనగర్ II టౌన్ లో మూడు కేసు లు నమోదు చేసారు
పట్టుబడిన బాధిత మహిళలను (సెక్స్ వర్కర్స్ ) ఐదుగురిని సదర్ హోమ్ కి తరలించడం జరిగింది
కొంత మంది నిర్వాహకులు పక్క జిల్లాలనుండి తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహులతో విటులు ఫోన్ లో మాట్లాడి అమ్మాయిలను బుక్ చేసుకొని వస్తున్నారు.
కరీంనగర్ నగరంలోని వ్యభిచార నిర్వహిస్తున్న ఇండ్లపై టాస్క్ ఫోర్స్ నిఘా ఉందని ఇప్పటికైనా వ్యభిచారం మానుకోవాలి లేనియెడల అట్టి నిర్వాహకులపై PD act పెట్టడం జరుగుతుందని కమీషనర్ ఆఫ్ పోలీస్,వి.బి కమలహాసన్ రెడ్డి హెచ్చరించారు. ఈ దాడిలో ఏసిపిలు పి.శోభన్ కుమార్ , ఎస్.శ్రీనివాస్ రావు, ఇన్స్పెక్టర్లు కె.జనార్దన్ రెడ్డి, సిహెచ్.దేవా రెడ్డి, తులా శ్రీనివాస్ రావు ఎస్ఐ నరేష్, నరసయ్య, స్పెషల్ పార్టీ, మహిళా పోలీస్ సిబ్బంది ,టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.