Telangana
తగలబడ్డ పత్తి గోదాం… రూ.13 కోట్ల నష్టం
kalina Times Nagar kurnool ; నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ కాటన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు పదమూడున్నర కోట్ల విలువైన పత్తి కాలి బూడిదైంది. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని బాలాజీ రూరల్ వేర్ హౌసెస్లోని గోదాంలో 20కోట్ల విలువైన పత్తి నిల్వలు ఉన్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగుపాటుకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దాదాపు పదమూడున్న కోట్ల విలువైన పత్తి కాలిపోయింది. తెల్లవారుజాము 3గంటల నుంచి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. గోదాం నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి