Religious
సూర్యుని వలననే రాత్రి, పగలూ
KALINGA TIMES ; సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. ఆయనే ఈ ప్రపంచానికి నేత్ర ము. సూర్యుని వలననే రాత్రి, పగలూ ఏర్పడుతూ ఉన్నాయి.. గ్రహాలూ, నక్షత్రాలూ, యోగాలూ, రాసులూ, ఆదిత్య గణాలూ, రుద్రులూ, వసుగణాలు, ప్రజాపతి, అగ్ని, వాయువూ, ఇంద్రుడూ, స్వః ఆదిలోకాలూ, పర్వతాలూ, నదీ నదాలూ, నాగులూ, సముద్రాలూ, సమస్త భూతగణాలూ సూర్య నారాయణుడి యందే ఉన్నాయనేది కొందరి నిశితాభిప్రాయం అయితే ఈ జగత్తంతా ఆయన వలననే జాగృతం అవుతున్నదని అంద రూ అనుభవ పూర్వకంగా గ్రహించగలిగే నగ్నసత్యం. జగత్తు ఉత్ప న్నం కావడానికి మూలకారణం దివాకరుడే.
జగత్తునందు సర్వకార్యకలా పాలూ సూర్యుని వల్లే జరుగుతున్నాయి. వైకుంఠమందు విష్ణు మూర్తి, కైలాసమందు శివశంకరుడూ, బ్రహ్మలోకంలో చతుర్ముఖుడూ ఉన్నట్లుగానే ఈ సూర్యభగవానుడు ఉండే లోకం ఆదిత్య లోకం. అదే సూర్య మండలం. సూర్యుడు కాలచక్రాన్ని నియమించేవాడు.
ఆది త్యుడి వలననే రాత్రింబవళ్లూ, గంటలూ, నిము షాలూ, మాసాలూ, పక్షాలూ, ఆయనాలూ, సంవత్సరాలూ మొదలై నవి విభజింప బడుతూ ఉన్నాయి. సూర్యుడులేని ప్రపంచాన్ని మనం ఊహించ లేము. ఈ ప్రపంచానికి ఆయనే ప్రకాశకుడు. ఆయనలేని ప్రపంచం అంధకారమయం. ఆయనే జీవము. ఆయనే తేజస్సు. ఆయనే బలము. ఆయనే యశము, శ్రోత, ఆత్మ, మనస్సు అయివున్నారు. ఆయన హిరణ్యవర్ణుడు. చతుర్భుజుడు. సూర్యనారాయణుని రూపంలో ఎందరో ఆయనను ఉపాసిస్తూ ఉన్నా రు. నారాయణుడి రూపంలో అర్జించడం వలన మనోవాంఛితాలు నెరవేరతాయి. సర్వ పాపాలూ పటాపంచలవుతాయి.
సూర్యుడు నెలకొక రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తూ ఉంటాడు. పన్నెండు నెలల్లోనూ పన్నెండు రకాల రూపాలను ధరిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను ‘ద్వాదశాత్మ అంటూ ప్రార్థిస్తున్నాము.
చైత్రమాసంలో ధాత, కృతస్థలి, హెతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యు డు, తుంబురుడు అతని పరిజనం సమేతంగా పరిభ్రమిస్తాడు. వైశాఖంలో ‘ఆర్యముడు అనే పేరుతోనూ, చైత్రంలో ధాత, జ్యేష్ఠ మాసంలో ‘మిత్రుడు, ఆషాఢమాసంలో ‘ఇంద్రుడు, భాద్రపద మాసంలో ‘వివస్వంతుడు, ఆశ్విజమాసంలో ‘తృష్ట, కార్తీకమాసంలో ‘విష్ణు , మార్గశిర మాసంలో ‘తవ్యముడు , పుష్య మాసం లో ‘క్రతువు అని పిలవబడుతూ సంచరిస్తాడు. సూర్య భగవానుడికి సప్తాశ్వుడనే మరో పేరు కూడా ఉంది. కొందరు ఈయన ఏడు గుర్రాలు కట్టిన రథం ఎక్కేవాడని అంటే మరి కొందరు ‘సప్త అనే గుర్రం కలవాడనీ చెబుతారు. సూర్యకిరణాల్లో ఏడు రంగులుం టాయి. ఈయనను మార్తాండుడు అని కూడాఅంటారు.
అనగా మృత మైన బ్రహ్మాండాన్ని బ్రతికించేవాడు అని అర్థం. మేఘ రూపంలో ప్రపంచాన్ని తడిపేవాడు కావున మిహిరుడు అనబడుతున్నాడు. ఈయన సర్వప్రాణుల తోనూ స్నేహభావం కలిగి ఉన్నాడు కావున ‘మిత్రుడు అని పిలవబడు తున్నాడు