నాగర్ కర్నూలు జూన్ 21 : సమాజ హితం కోసం శక్తిని ఉపయోగించా లని జిల్లా సంయుక్త కలెక్టర్ p.శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రతి ఒక్కరు యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించడం జరుగుతుందని ఆయన అన్నారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయుష్ శాఖ పతంజలి యోగ సమితి భారత్ స్వభి మాన్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు యోగా సాధన చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా జీవించిన సంఘటనలు ఉన్నాయని వివరించారు యోగా సాధన చేసే తీరును బట్టి వాటి ఫలితాలు ఉంటాయని సూచించారు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎంతో మానసిక ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని దీని తో అనారోగ్యాలకు గురవుతున్నారని నిత్యం యోగ సాధన ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు యోగ సాధన ద్వారా ఎన్నో రకాల రోగాలను పోగొట్టుకోవచ్చు నని అన్నారు యోగ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అక్కడికి విచ్చేసిన వారితో యోగ పతాంజలి అధ్యక్షుడు శివుడు యోగా చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హనుమానాయక్ డి ఆర్ డి ఓ పి డి సుధాకర్ హార్టికల్చర్ పిడి చంద్రశేఖర రావు పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ ఇరిగేషన్ నాగార్జున రెడ్డి మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని ప్రజ్వల డీఈవో గోవిందరాజులు ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ గంగారం మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి యోగ గురు రఘు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్మయ్య లతోపాటు అనేకమంది ప్రజలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు