Andhra PradeshNational
రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి భారీ షాక్ తగిలింది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు టీడీపీని వీడుతున్నట్లు నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్.. చైర్మన్ వెంకయ్యనాయుడుని కలిసి లేఖ ఇచ్చారు. ఇక నుంచి తమను ప్రత్యేక వర్గంగా పరిగణించాలని వెంకయ్యకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ సంతకాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ ఎంపీలు తమపై ఒత్తిడి ఉందిని దీంతో వెళ్లకతప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో కుటుంబ సమేతంగా బిజిబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు, సీనియర్లకు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు రాజ్యసభ ఎంపీల బాటలోనే పలువురు ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు కూడా క్యూ కడతారని చంద్రబాబు విదేశాల నుంచి తిరిగొచ్చే లోపు టీడీపీ ఖాళీ అవుతుందని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.