Telangana
మంచిర్యాల మున్సిపల్ అధికార నేతలపై అవినీతి ఆరోపణలు
KALINGA TIMES : మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గం పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, గత అయిదేళ్ళలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట బిజెపి నేతలు ఢర్నా నిర్వహించారు.అనతరం కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
ఈ సంధర్భంగా బిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీలో అధికారుపై తెరాస నేతల మరియు పాలక వర్గ నేతల ఒత్తిడి ఉందని అందుకే వారు సజావుగా పనిచేయలెక పోతున్నారని ఆరోపించారు.
ఈ అయిదేళ్ళలో పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసినట్లు వారు ఫీలవుతున్నారని విమర్శిచారు. అసలు వారు ఈ అయిదేళ్ళలో ఒరగబెట్టిందేమూలేదని దుయ్యబట్టారు.ప్రతి పనిలో కమీషన్లు దండుకొని వారు మాత్రం గొప్పగా అభివృద్ధి చెందారని ఆరోపించారు.
ఏదైనా పనిమీద ముసిపల్ కార్యాలయానికి సామాన్యులు వెళితే సరైన సమాధానం ఉండదని వార్డు కౌన్సిలర్ కనుసన్నుల్లోనే ఏ పనైనా జరగల్సిందేనన్నారు.ఈ అవినీతిని పెంచి పోషిస్తుంది కూడా బడా నేతలేనని వారు ఆరోపించారు.
గత అయిదేళ్ళ కాలంలో మున్సిపల్ కు వచ్చిన నిధులు వాటిని ఉపయోగించిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చ జరుపుదామని దీనికి పాలకవర్గ నేతలు కలసి రావాలని డిమాండ్ చెశారు.శాసన మంచిర్యాల సభ్యులు ఈ విషయం పై తక్షణమే స్పందించాలన్నారు.అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయలని డిమాండ్ చేశారు