NationalTelangana

కేసీఆర్ కేంద్ర సర్కార్ తో దూరంగా ….

KALINGA TIMES ; తెలంగాణా రాష్ట్ర సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కేంద్ర సర్కార్ తో దూరంగా ఉంటున్నట్టు తాజా పరిణామాల నేపధ్యంలో కనిపిస్తుంది. ఎన్నికల ముందు కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చక్రం తిప్పుతామని భావించిన కేసీఆర్ కు ఎన్నికలు షాక్ ఇచ్చాయి. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . అయితే ఫలితాలకు ముందు కేంద్రంలో హంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయని అప్పుడు కీలక భూమిక ఫెడరల్ ఫ్రంట్ దేనని కేసీఆర్ భావించారు. అంతే కాక తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలు సాధించటంతో బీజేపీ అధినాయకత్వం దృష్టి తెలంగాణాపై పడింది.దీంతో కేసీఆర్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరిగినట్లయింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీ .. అదే కేసీఆర్ ఆగ్రహానికి కారణం

బీజేపీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి, అటు అధికార పార్టీ నుండి కీలక నాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో ఉంది. అందుకోసం రంగంలోకి దిగిన రాం మాధవ్ ఇప్పటికే పలువురు ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనని చెప్తున్నారు.
ఈ నేపధ్యంలోనే ప్రధాని మోడీకి కేసీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. దాంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించే ఆలోచన కూడా చేయలేదు కేసీఆర్ . కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చిల్లిగవ్వ ఇవ్వలేదు .. ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాలా? కేసీఆర్ ఫైర్ తాజా మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షా లపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు .

కాళేశ్వరానికి మోడీని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నకు కేసీఆర్ మండిపడ్డారు. ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాలా? అన్ని ప్రశ్నించిన కేసీఆర్ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచాం కదా అని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం సాధకుడిని తానేనని చెప్పుకున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సంచలన వ్యాఖ్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేసీఆర్ పేర్కొన్నారు .
అయినా తాను ఢిల్లీకి వెళితే ఓ స్టోరీ , వెళ్లకుంటే మరో స్టోరీ, ఇదంతా సిల్లీ వ్యక్తులు చేసే పని అంటూ తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్న మీడియాపైన కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాజెక్ట్ లకు కేంద్రం పైసా సాయం చేయలేదంటూ పదేపదే చెప్పుకొచ్చిన కేసీఆర్ తద్వారా బిజెపి పట్ల ఆకర్షితులు అవుతున్న తెలంగాణ ప్రజలకు కమలం తమ ప్రాంతానికి చేసింది ఏమీలేదని తేల్చేశారు కెసిఆర్. కేంద్రంపై కొన్ని అంశాలతో ఏకీభవిస్తామని తెలంగాణ కు నష్టం అనుకుంటే విభేదిస్తామని వ్యాఖ్యానించి రాబోయే రోజుల్లో కారు టార్గెట్ ఎవరో చెప్పక చెప్పేశారు కేసీఆర్.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close