Telangana
ప్రతి బిడ్డకు ఉన్నత విద్యను అందించాలనేదే తెరాస ప్రభుత్వం లక్ష్యం..
వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడి ఈడు పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ యాదయ్య కలిసి జయశంకర్ బడిబాటా కార్యక్రమాన్ని ప్రారంభించారు,అనంతరం విద్యార్థులు స్థానిక నాయకులతో కలిసి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు,
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తూ,అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్,వార్డ్ సభ్యులు కె.వెంకటేష్ గౌడ్,శేఖర్ ముదిరాజ్,నరేందర్ గౌడ్,సైయాద సత్తార్ హుస్సేన్,సాబేర్,వెంకట్ రెడ్డి,రామారావు,పాషా,ఙ్ఞానేశ్వర్,ముజీబ్ తదితరులు పాల్గొన్నారు