Telangana
సమస్యలకు నిలయం పాపి రెడ్డి కాలనీ… !
KALLINGA TIMES : ప్రతి నిత్యం ఏదో ఒక సమస్యతో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ రోడ్లపైన మురికి నీరు పారుతూ సమస్యలకు నిలయంగా మారింది, పాపి రెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, అపార్ట్ మెంట్ల మధ్య డ్రైనేజీలు నిండు పోయి అస్తవ్యస్తంగా మారిన నేటి వరకు జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు, ఇక రాజీవ్ గృహకల్ప ఇండ్లలో డ్రైనేజీ లో నిండు పోయి ప్రజలు రోగాల పాలు అవుతున్న పట్టించుకోవడం లేదు, ప్రతి రెండు రోజులకు ఒకసారి దోమల మందులను స్ప్రే చేయాల్సింది పోయి వారానికి ఒకసారి నామమాత్రంగా స్ప్రే చేయడంతో దోమలు నివారణ కాకపోవడం లేదు, ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు