Religious

ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు

హైదరాబాద్ జూన్ 9 : సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది చివరకు సూర్యునితోనే
అంతమవుతుంది…

* సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఈ
విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం. వారంలోని
ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పులేదు కానీ…ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం
తినకండి…
* ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని…మన వేదాల్లో ఉంది. ఉదాహరణకి ఈ
రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆరోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది.
ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే ఆదివారం రోజున
మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు…
* మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి…సంపూర్ణ ఆరోగ్యానికి
అబ్బురపడ్డారు.
ఎందుకు భారతీయులు ఉత్తేజంగా… ఉల్లాసంగా.. సిరిసంపదలతో తులతూగుతున్నారో
అన్వేషించారు. చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు
కారణమని తెలుసుకున్నారు…
* భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్లల్లో కలిగింది.
ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు.
దీంతో ఆదివారం రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు
నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు…
* ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా
వారు ప్రకటించారు. కానీ తాము మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించేలా
ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రార్ధనాస్ధలాలకి రావాలనే నియమాన్ని పెట్టు
కున్నారు…
* ఇలా మన ఆచారానికి మత రంగు అద్దుకుని ఆదివారం నాటి శక్తిని క్రిష్టియన్స్ పొందుతున్నారు.
కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం ‘మందు ముక్క’ అంటూ తమ తరతరాల ఆచారాన్ని
పక్కదోవ పట్టించుకున్నాము…
* కాబట్టి ఇప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని మనం గుర్తించాలి. ఆదివారం రోజున మన చేతనైన
నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు – మన పిల్లలు అందరూ పాటించేలా
చేయాలి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close