రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి : శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోగల నేతాజీ నగర్ లో బీద మధ్యతరగతి కుటుంబాలు జీవనం గడుపుతున్నారు , ఆరోగ్య పరిస్థితులు బాగాలేక మృతి చెందితే స్వంత గ్రామాలకు తీసుకెళ్లడానికి స్తోమత లేనివారికి దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న కాలనీ లో చనిపోయిన వారు ఇక్కడికి వస్తుంటారు, స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ,దహన సంస్కారాలకు షెడ్డు ఏర్పాటు చేయాలని ,అలాగే నీటి వసతి కొరకు బోరు వేసి కనీస వసతులు కల్పించగలరని కోరుతున్నారు,
గతంలో కూడా స్థానిక కార్పొరేటర్ గచ్చిబౌలి డివిజన్ సాయి బాబాతో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్కిల్ 20 కమిషనర్ కమిషనర్ హరి చందనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ,సర్కిల్ 20 ఉపకమిషనర్ మమతకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ,స్మశానవాటికలో చెత్త చెదారం వేయడం జరుగుతుంది ,ఇక్కడ దుర్గంధపు వాసన వెదజల్లుతుంది ,మనిషి బతికి ఉన్నంత సేపు కష్టనష్టాలతో జీవితం సాగిస్తూ …సమాజంలో బాధలు భరిస్తూ.. కూడా చివరి శ్వాస వదులుతారు. ఈ నేపథ్యంలో స్మశానవాటికలో కూడా ప్రశాంతత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు భేరీ రామ్ చందర్ యాదవ్ . నల్లగండ్ల చెరువు గతంలో చెరువు కింద ఎన్నో పంటపొలాలు ఎన్నో జీవరాసులు, పశువులు పచ్చటి గడ్డి మేసి మంచినీళ్లు తాగి జీవిస్తుండేవి, బెస్త వాళ్లు చాపలు పెంచి అమ్మే వాళ్లు, రజకులు ధోబి ఘాట్ బట్టలు ఉతికి తమ జీవనం సాగించేవాడు , ఇలాంటి నల్లగండ్ల చెరువు బహుళ అంతస్తులు చుట్టుపక్కల నిర్మాణం చేస్తూ చెరువు కలుషితం చేస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవలసిన అవసరం చాలా ఉంది (ఫోటో వార్త : చెత్తతో నిండిన కాలనీలు)