Telangana
కైతలాపూర్ లోని ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
KALINGA TIMES :కూకట్ పల్లి మండల పరిధిలోని కైతలాపూర్ లోని కాముని చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తహసిల్దార్ నిర్మల నాయర్ ఆధ్వర్యంలోకూకట్పల్లి రెవెన్యూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు రాత్రులకు రాత్రులు వెలిసిన నిర్మాణాలు వాటి లో ఉన్న ప్రజలను బయటకు తీసుకువచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి తాసిల్దార్ మాట్లాడుతూ ఎఫ్టీఎల్ పరిధిలో గతంలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేశారు . ఆ లేఅవుట్ ను అధికారులు రద్దు చేశారు అయితే అప్పటి నుంచి అక్రమ నిర్మాణాలను జరగనీయకుండా రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నప్పటికీ ఇటీవల రాత్రులు అక్రమ నిర్మాణాలు వెలిశాయి అని వాటిని ఈరోజు పోలీసుల బందోబస్తు మధ్య తొలగించామని ఆమె తెలిపారు ఇంకా పరిధిలో సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలు వెలికితీసి తొలగించి చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు..