
మంచిర్యాల ఏప్రిల్ 27 (న్యూస్ పల్స్) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత, శిశు సంరక్షణతో పాటు ప్రసవాల లక్ష్యాలను పూర్తి అయ్యేలా వైద్య అధికారులు, వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు నెలసరి లక్ష్యాలు తప్పనిసరిగా పూర్తి చేయాలని కోరారు. వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రసవం అనంతరం కెసిఆర్ కిట్ తో పాటు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. మాత శిశు సంరక్షణలో వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వైద్యశాలలో ప్రభుత్వం అన్నివిధాలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కన్పులు జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీని పై సంబంధిత వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు మెరుగైన వైద్య సేవలతో పాటు సేవా భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆరోగ్యపరమైన మందులు. టీకాల తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మేరకు మందులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా ఎం ఎం ఆశ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి భీష్మ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. సూపరింటెండెంట్ యశ్వంతరావు. గైనకాలజిస్ట్ వైద్యాధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.