
Local News India : దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం(ఈసీ) గత రెండువారాలుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 539కోట్ల విలువైన నగదు, మందు, డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ మేరకు ఈసీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో అత్యధికంగా రూ. 107.24కోట్లు లభ్యమయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్(రూ.103.4 కోట్లు), ఏపీ (రూ.103.4కోట్లు), పంజాబ్(రూ. 92.8కోట్లు) నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 55కోట్ల నగదు, రూ. 12కోట్ల విలువైన మద్యం, రూ.40లక్షల విలువైన డ్రగ్స్, రూ.30కోట్ల విలువైన బంగారం, వెండి, రూ. 6కోట్ల విలువైన ఇతర వస్తువులు జప్తు చేశామని, మొత్తం విలువ రూ. 103.4 కోట్లు ఉంటుందని ఈసీ వివరించింది. తెలంగాణలో రూ. 5.26కోట్ల నగదు, రూ.39లక్షల విలువైన 12లక్షల లీటర్ల మద్యం, రూ. 16లక్షల విలువైన బంగారం, రూ. 2.38కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నామని పేర్కొంది.