National

ఒకటి, రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేఫషన్

న్యూఢిల్లీ, మార్చి 8, (LOCAL NEWS INDIA)
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుంది. ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. అన్ని ఏర్పాట్లు ఇప్పుడు తుది దశకు చేరడంతో 17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఈ వారాంతంలో కానీ వచ్చే వారం ఆరంభంలో కానీ వెలువడుతుందని స్పష్టం అయింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాల పరిమితి జూన్ 3వ తేదీతో ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి మిత్రపక్షాలతో కూడిన ఎన్‌డిఎతో ఎన్నికల రంగంలోకి దిగుతారు.దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం మీద వచ్చే మంగళవారం లోగా ఈ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎప్రిల్ మే నెల మధ్యలో మొత్తం ఏడు నుంచి ఎనిమిది దశలలో ఈ ఎన్నికలు జరుగుతాయని విశ్వసనీయ సమాచారం ఎన్నికల షెడ్యూల్ జాప్యంపై ఇప్పటికే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకటనకు మిగిలి ఉన్న అత్యంత కీలక వ్యూహాత్మక ఏర్పాట్లు తుది దశలో ఇప్పుడు ఎన్నికల సంఘం నిమగ్నం అయింది. ఇవి పూర్తి కాగానే ఎప్పుడైనా ఎన్నికల తేదీలు, దశల వారి వివరాలతో సమగ్ర ప్రకటనను వెలువరిస్తారు. మరో సారి అధికారం కోసం పాటుపడుతారు. మరో వైపు ఈ సారి దేశంలో వినూత్న రీతిలో మోడీకి వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు జట్టుకట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. పోటీ ద్విముఖమా? త్రిముఖమా? బహుముఖమా అనేది త్వరలోనే వెల్లడికానుంది.వచ్చే వారంలోనే ఎన్నికల పరిశీలకుల కీలక భేటీ జరుగుతుందని భావిస్తున్నారు. పోలింగ్ మొద టి రెండో దశలపై విస్తృత స్థాయి చర్చలు ఉంటాయి. ఎన్నికల తేదీల ప్రకటనకు రంగం సిద్ధం అయిందని, ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఈ షెడ్యూల్ వెలువడనుందని ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం లోగానే ఈ షెడ్యూ ల్ రావచ్చునని అనధికారికంగా చెప్పారు. తొలి దశకు అధికారిక ప్రకటన మార్చి చివరిలో వెలువడుతుంది. ఎన్నికలు ఏప్రిల్ ఆరంభంలో జరుగుతాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇసి భావిస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెం బ్లీ రద్దు కావడంతో అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల గడువు తరువాత జరగాల్సి ఉంది. మే చివరిలో ఈ గడువు పూర్తి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారా? లేదా అనేది అనుమానాస్పదంగా ఉంది.ఇక్క డ ఎన్నికల నిర్వహణపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడాన్ని కేంద్రం, కేంద్రం నియమించే గవర్నర్ కూడా వ్యతిరేస్తున్నారు. అయితే ఈ వారంలోనే ఎన్నికల సంఘం నిర్వహించిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు కలిపే నిర్వహిస్తే మంచిదని సూచించాయి. ఇక సిక్కిం అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 27తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 18న, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 11, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి జూన్ 1న ముగుస్తాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను వీటితో ముడిపెట్టడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తం గా గత కొద్ది వారాలలో ఎన్నికల నిర్వహణ విషయాల గురించి కమిషన్ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. తమ యంత్రాంగాన్ని పోలింగ్‌కు సమాయ త్తం చేసేందుకు విధి విధానాల నిర్ధేశానికి రంగం సిద్ధం చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఈ భారీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలోఉండే సమస్యల గురించి దృష్టి సారించింది.ఎన్నికలు ఏడు ఎనిమిది విడతలుగా నిర్వహించే విష యం దాదాపుగా ఖరారు అయింది. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఈ ప్రక్రియకు మొత్తం 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. వీటికి అవసరం అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటు నిర్థారిత పేపర్ ట్రయల్ మెషిన్లు ఈ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అత్యంత కీలకం గా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాల్సి ఉంటుం ది. 2004లో లోక్‌సభ ఎన్నికలు కేవలం నాలుగు దశలలోనే జరిగాయి. దీనికి ప్రకటనను ఆ ఏడాది ఫిబ్రవరి 29న వెలువరించారు. ఎప్రిల్ 20 వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. చివరి దశ పోలింగ్ మే 10న జరిగింది. 2009లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఇసి మార్చి 2వ తేదీన వెలువరించింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close