Andhra Pradesh

అమరావతిపై అనుమానాలు

అమరావతిపై ప్రజల్లో అపోహలు పెంచుతారా ...

అమరావతి, ఫిబ్రవరి 27(LOCAL NEWS INDIA)
రాజధాని విషయంలో వైసిపి అనుమానాలు సృష్టిస్తోంది. రాజధాని ఇక్కడే అని మేనిఫెస్టోలో పెడతారటఅని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి. రూ.50వేల కోట్లతో ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు నడుస్తున్నాయి. యాగ్జిలరీ రోడ్లు, అండర్ గ్రవుండ్ డ్రెయిన్లు,పార్కులు ఐదు టవర్లుగా సెక్రటేరియట్, బౌద్ద స్థూపాకృతిలో హైకోర్టు వుంటుంది. నాలుగు ఏళ్లుగా మన గడ్డమీద నుంచే మన పాలన కొనసాగిస్తున్నాం. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున అమరావతి వుంది. అలాంటిది ఇప్పుడు అమరావతిపై ప్రజల్లో అపోహలు పెంచుతారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వైసిపి మేనిఫెస్టోలో రాజధాని ఎక్కడ అనే అంశమా. వైఎస్సార్ కాంగ్రెస్ దుర్బుద్ధి ఏంటో బైటపడిందని అన్నారు. హైదరాబాద్ వీడి జగన్మోహన్ రెడ్డి రాలేదు. ప్యాలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడు. ఎక్కడకు పోయినా రాజ ప్రాసాదాల్లోనే జగన్ బస చేస్తారని అన్నారు. లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్.
అమరావతిలో ఇప్పుడు ఇంకో ప్యాలెస్. ప్యాలస్ లపైనే జగన్మోహన్ రెడ్డి ధ్యాస, బస అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పేదల పార్టీ కాదు, పేలెస్ ల పార్టీ. ప్రజాసేవ పట్ల జగన్ కు చిత్తశుద్ది లేదు. విశాఖ మోది సభకు వైసిపి జనాన్ని తరలిస్తోందని అన్నారు. బిజెపి,వైసిపి కుమ్మక్కును బైటపెట్టాలి. అన్నివర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి పోరాటమని అన్నారు. ఐదు కోట్ల ప్రజల హక్కుల సాధనే టిడిపి లక్ష్యమని అన్నారు. మార్చి 1న ప్రధానిమోది విశాఖ వస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి జెఏసి ఆందోళనలు చేస్తున్నారు. మన హక్కుల కోసం ర్యాలీలు, ఆందోళనలు, దీక్షలు. రాష్ట్రం కోసం జెఏసి ఉద్యమానికి టిడిపి తరపున పూర్తి మద్దతు వుంటుంది. ఐదు ఏళ్లుగా విశాఖ రైల్వే జోన్ పై బిజెపి నిర్లక్ష్యమని అన్నారు. దేశ సమగ్రతలో తెలుగుదేశం పార్టీ రాజీపడదు. దేశభక్తిలో టిడిపి అందరికన్నా ముందే ఉంటుంది.
విదేశీ దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. పుల్వామా దాడిని అందరికన్నా ముందు మనమే ఖండించామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు మన ఉద్యోగుల విరాళం దేశానికే స్ఫూర్తి. ఏపి ఉద్యోగులు అంతా కలిసి రూ.30కోట్లు విరాళం ఇచ్చారని అయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జవాన్ కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చింది. రాజకీయంగా పార్టీల మధ్య విబేధాలు ఉండవచ్చు. దేశభద్రతలో రాజకీయాలకు అతీతం తెలుగుదేశమని చంద్రబాబు అన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close