National
భారత్ గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు!
శ్రీనగర్, ఫిబ్రవరి 27(LOCAL NEWS INDIA)
పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ బుధవారం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ, పూంచ్ సెక్టార్లల కి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. దీంతో పాక్ యుద్ధ విమానం వెనక్కి వెళ్లిపోయింది. భారత్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో పాక్ విమానాలను తిరిగి తమ గగనతలంలోకి తిరిగి పోయాయి. మంగళవారం తెల్లవారుజామునుంచి సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఎప్పటికప్పుడు పాక్ కుయుక్తులను తిప్పికొడుతూ ఎలాంటి పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.