వరంగల్, ఫిబ్రవరి 27(LOCAL NEWS INDIA)
వరంగల్లో దారుణం చోటుచేసుకుంది. ప్రెమోన్మదానికి మరో యువతి సమిధగా మారింది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఘటన వివరాలు ఇలా వున్నాయి. సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన సుధాకర్ రావు, పద్మ కూతరు రవళి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె స్వస్థలం నుంచి బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తున్న సమయంలో సాయి అన్వేష్ అనే యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ అన్వేష్ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. ప్రేమ తిరస్కరించిందని ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన అన్వేష్ కు దేహశుద్ధి చేసిన తోటి విద్యార్థులు పోలీసులకు అప్పగించారు. రవళి శరీరం ఎనభై శాతం కాలినట్లు డాక్టర్లు ధృవీకరించారు.