Telangana

పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దృష్టి

హైద్రాబాద్, ఫిబ్రవరి 26, (LOCAL NEWS INDIA)
పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. మార్చి 1 నుంచి పది రోజుల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు జరుపాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి 11 వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి రోజు రెండు సమావేశాలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ మార్చి 1వ తేదిన కరీంనగర్ లో, మార్చి 2న వరంగల్, భువనగిరి, మార్చి 3న మెదక్, మల్కాజ్ గిరి, మార్చి 6న నాగర్ కర్నూల్, చేవెళ్ల, మార్చి7న జహీరాబాద్, సికింద్రాబాద్, మార్చి 8న నిజామాబాద్, ఆదిలాబాద్. మార్చి 9న పెద్దపల్లి, రామగుండం. మార్చి 10న మహబూబాబాద్, ఖమ్మం. మార్చి 11న నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో కార్యకర్తలతో ఎన్నికల సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ర్టంలోని 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోశిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌ ఒక్కో నియోజకవర్గం నుంచి ముఖ్యనాయకులతో పాటు 15 వేల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని ఆయా జిల్లా మంత్రులే సమావేశాల ఏర్పాట్లు చూసుకుంటారని చెప్పారు. మంత్రులు లేని జిల్లాల్లో సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సన్నాహక సమావేశాల్లో అభ్యర్ధులఎంపికపై ఎలాంటి చర్చ ఉండదని పార్టీ అభ్యర్ధి గెలుపే లక్ష్యంగా కొనసాగుతాయని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close