Andhra Pradesh
రేణు దేశాయ్ తో జగన్ మైండ్ గేమ్
కర్నూలు, ఫిబ్రవరి 26, (LOCAL NEWS INDIA)
జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అంటూ, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్ లు చేసారు జగన్.. అప్పట్లో జనసేన నేతలు షర్మిల పెళ్ళిళ్ళు పై, మాట్లాడుతూ, ఇరు వర్గాలు నీచంగా తిట్టుకున్నాయి.ఇప్పుడు ఆ నలుగురు నలుగురు పెళ్ళాల్లో, ఒకటైన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తో జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఇప్పటికే, కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ లో భగంగా, ఇప్పుడు అదే కర్నూల్ కు ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ని పర్యటించేలా ప్లాన్ చేసారు జగన్. ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు అడిగి తెలుసుకోనున్నారు. ఆమె.. త్వరలో రైతు సమస్యలపై సినిమా తీయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె ఈ పర్యటన చేస్తున్నారు. రేణు దేశాయ్ తో పాటు సాక్షి సిబ్బంది ఉండటమే అసలు హైలైట్. రేణు దేశాయ్ సాక్షి టీవీ లో యాంకర్ గా తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తా బాగా ప్రచారం అవుతుంది. ఇందుకు తగ్గట్టే, సాక్షి సీనియర్ యాంకర్ స్వప్నతో కలిసి, సాక్షి టీవీ లోగోతో అక్కడి రైతులను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని డైవర్ట్ చేయడానికి ఇది జగన్ పన్నిన కుట్రనా.. అనే ప్రశ్న అటు కర్నూల్ జిల్లా లోనూ మరియు జనసైనికుల లోనూ మొదలయ్యింది. ఒక్కసారిగా ఆమె సాక్షి లోగోతో ప్రత్యక్షమవ్వడంతో అంతా గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ కు ధీటుగా రేణు దేశాయ్ ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ నిర్వహించబోయే కార్యక్రమాలను సాక్షి టీవీ లైవ్ కవరేజ్ మాత్రమే ఇస్తుందని రేణు దేశాయ్ సిబ్బంది చెప్తున్నారు. ఏది ఏమైనా, పవన్ ను రెచ్చగొట్టటానికి, జగన్ ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే కాబట్టి, వాళ్ళు ఎలా కొట్టుకుంటే మాకేంటి అంటూ, తెలుగుదేశం పార్టీ, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంది.