Film

నిలిచిపోయిన సైరా చిత్ర షూటింగ్

హైద్రాబాద్, ఫిబ్రవరి 25 (LOCAL NEWS INDIA)
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా ప్రతి సీన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. నిర్మాత రామ్‌చరణ్ ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సైరా’కు అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు కర్ణాటకలోని బీదర్‌లో గల బహమని కోటలో యూనిట్ అంతా సిద్ధం చేసుకుంది. అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకుని సోమవారం షూటింగ్ ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. షూటింగ్‌లో భాగంగా కోటలో హిందూ దేవతల విగ్రహాలు నెలకొల్పారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ముస్లిం యువత షూటింగ్‌ను అడ్డుకుంది. ముస్లింల కోటలో హిందూ దేవతల విగ్రహాలతో షూటింగ్ చేయడమేంటని నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ముస్లిం నేతలతో చర్చించారు. వారు షూటింగ్ జరిపేందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక ‘సైరా’ యూనిట్‌ను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్న షూటింగ్ నిలిచిపోవడంతో యూనిట్ నిరాశగా వెనుదిరిగిందట. ఈ సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో భారీ సెట్ వేసి షూట్ చేయాలని దర్శకుడు సురేందర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close