న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (LOCAL NEWS INDIA)
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సంస్థలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఆ సంస్థ సీనియర్ అధికారులకు ఐటీ అంశంపై పార్లమెంటరీ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 6వ తేదీన ఆయా సంస్థలకు చెందిన సీనియర్లు కమిటీ ముందు హాజరుకావాలన్నది. సోషల్ ఆన్‌లైన్ మీడియా వేదికల్లో పౌరుల హక్కులను రక్షించాల్సిన అంశంపై చర్చించనున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా సంస్థలు ఎటువంటి ప్రభావాలు చూపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ అనురాగ్ ఠాకూర్ కోరారు. సోషల్ మీడియా సంస్థలు.. ఎన్నికల సమస్యలపై ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయాలన్నారు. ట్విట్టర్ సంస్థ సీఈవో జాక్ డోర్సీ రాసిన లేఖను అనురాగ్ ఠాకూర్ చదివి వినిపించారు.