Film

బాలయ్య వర్సెస్ నాగబాబు

హైద్రాబాద్, జనవరి 7, (లోకల్ న్యూస్)
మెగా హీరో నాగబాబు బాలకృష్ణ ని అట్టా ఇట్టా వదిలేలా కనబడ్డం లేదు. బాలకృష్ణ ఎవరో తెలియదనడం, బ్లడ్, బ్రీడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం, బయోపిక్ లపై నాగబాబు నెగేటివ్ కామెంట్స్ చూస్తుంటే బాలయ్య ని మాత్రం వదిలేది లేదు అన్నట్టుగా వుంది నాగబాబు వ్యవహారం.

ఆఖరుకి బాలకృష్ణ అభిమానులనుండి నిరసనల సెగ తగిలినా నాగబాబు మాత్రం ఏ మాత్రం భయపడకుండా.. బాలకృష్ణ ని ఉద్దేశించి కామెంట్ వన్, కామెంట్ టు అంటూ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కామెంట్ వన్ లో మెగా హీరోలను టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడొచ్చుగాని… మేము మాట్లాడితే తప్పా.. పవన్ కళ్యాణ్ వలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదంటే మేమురుకోవాలా… అంటూ వీడియో పోస్ట్ చేసిన నాగబాబు గత రాత్రి…. బాలకృష్ణ మేమే హీరోలం.. మేమెవరినీ హీరోలం చెయ్యము… మేమె సూపర్ స్టార్స్ అన్న కామెంట్ చూపిస్తూ…మీరెవరిని హీరోలను చెయ్యక్కర్లేదు.. జనాలు చూసి మెచ్చితేనే హీరోలవుతారు.. మీరొక్కరే సూపర్ స్టార్ కాదు.. ఇండస్ట్రీలో.. మాకు మామే సూపర్ స్టార్స్ అంటూ అనడం ఏమిటి.. మీరు అనే వాటికీ మేము కౌంటర్ చేయలేమా.. ఎందుకులే చూద్దాం.. చూద్దాం అని ఊరుకున్నాం. మీరేనా సూపర్ స్టార్స్.. మీరే హీరోలా.. పవన్ కళ్యాణ్ హీరో కదా.. ఇండస్ట్రీలో మీరే కాదు సూపర్ స్టార్స్.. ఇంకా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగా స్టార్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలున్నారు.. మీరొక్కరే కాదు.. ఇక మూడో కామెంట్ కోసం ఈరోజు ఉదయం తొమ్మిది వరకు వెయిట్ చెయ్యమని నాగబాబు వీడియో మెస్సేజ్ పెట్టాడు.మరి ఇదంతా చూస్తుంటే విడుదలకాబోయే ఎన్టీఆర్ బయోపిక్ మీద ఎమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అనే కంగారులో నందమూరి అభిమానులున్నారు. నాగబాబు ఇలా కామెంట్ వన్, టు, త్రీ, ఫోర్ అంటూ బాలయ్య ని నెగెటివ్ గా చూపిస్తూ చేస్తున్న కామెంట్స్ వలన.. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాకి మంచి టాకొచ్చిన… కలెక్షన్స్ పరంగా దెబ్బపడుతుందేమో అనే సందేహాలు నందమూరి అభిమానులు వ్యక్తం చెయ్యడమేగాదు.. వారు కాస్త భయపడుతున్నారు కూడా. బాలయ్య గతంలో చేసిన కామెంట్స్ అండ్ తప్పులను వెతుకుతూ నాగబాబు కాస్త లేట్ గా స్పందించినా.. ఘాటుగా స్పందిస్తూ బాలకృష్ణ భరతం పడుతున్నాడు. మరి బాలకృష్ణ మాత్రం తనకేం పట్టనట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నాడు. చూద్దాం మెగా హీరో నాగబాబు ఎఫెక్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మీద ఏ మేర పనిచేస్తుందో అనేది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close