Telangana
చంద్రబాబు దేశంలోనే డర్టియెస్ట్ పొలిటీషియన్ : కేసీఆర్
హైద్రాబాద్, డిసెంబర్ 29 (లోకల్ న్యూస్)
హైకోర్టు విభజన వ్యవహారంలో చంద్రబాబు నాయుడుపై
తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బాబు టార్గెట్‌గా
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలు ఎక్కుబెట్టారు
చంద్రబాబు నాయుడిని దేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్‌గా అభివర్ణించిన కేసీఆర్ టీడీపీ నాయకులు జీర్ణించుకోలేని రీతిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్లపాటు బాబు మోదీ చంక నాకారన్నారు.. ఇప్పుడు రాహుల్ చంక నాకుతున్నారంటూ మండిపడ్డారు. బాబును భరిస్తోన్న ఏపీ ప్రజలకు చేతులెత్తి మొక్కాలన్న ఆయన.. నేను నవీన్ పట్నాయక్‌ను కలిస్తే చంద్రబాబుకు సమస్య ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబుకు మాట మీద నిలబడేతత్వం లేదన్న కేసీఆర్.. డర్టీయెస్ట్ పొలిటీషన్ అంటూ బాబుపై పదే పదే విమర్శలు గుప్పించారు. ఏపీ సెక్రటేరియట్‌కు దేశంలోనే మొదటి సారిగా రాఫ్ట్ టెక్నాలజీగా ఫౌండేషన్ వేశామంటూ బాబు సర్కారు ఇచ్చిన ప్రకటనపై కూడా కేసీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోనే వెయ్యికిపైగా భవనాలు ర్యాఫ్ట్ ఫౌండేషన్‌తో వేసినవని కేసీఆర్ తెలిపారు. ఈ అబద్దాల మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు.
ఆయనకు రెండు మూడు బాకాలున్నాయంటూ.. మీడియాపై సెటైర్లు వేశారు. యూజ్ అండ్ త్రో నంబర్ వన్ అంటూ విమర్శించారు. హరికృష్ణ శవం మీద పేలాలు ఏరుకునే రకం అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సుహాసినికి ఇప్పుడేమైనా చేస్తారా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 40 రోజులు దాటిందన్న కేసీఆర్..
హైకోర్టు విభజన హడావుడిగా జరగలేదన్నారు. హైకోర్టును విభజించింది సుప్రీం కోర్టు అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం గెజిట్ మాత్రమే ఇచ్చిందన్నారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాల మీద కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు హోదా కావాలన్న డిమాండ్ సరైందా లేదంటే.. మీ శ్వేత పత్రాలు నిజమా అని నిలదీశారు.
రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతోందని… ఏ సీఎం అయినా, ఏ నాయకుడైనా వారి ప్రజలకు ఇబ్బంది కలగకుండా హైకోర్టును అక్కడకు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏది పడితే అది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటారని… ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయని విమర్శించారు. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
డిసెంబర్ నాటికి హైకోర్టును ఏపీకి తీసుకెళతామని ఏపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని… హైకోర్టును ఏపీకి తీసుకెళ్లాల్సిన అవసరంలేదని… ఇక్కడే రెండు హైకోర్టులను వేర్వేరుగా నిర్వహించవచ్చని తాము కూడా అఫిడవిట్ వేశామని చెప్పారు. కోర్టును సపరేట్ చేస్తే చాలని తాము చెప్పామని అన్నారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని… అంతా ఆయన ఇష్టమేనా అని దుయ్యబట్టారు. చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నాయకుడిని కలిస్తే చంద్రబాబుకు ఏం సమస్య అని కేసీఆర్ ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు మోదీకి డబ్బా కొట్టి… ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన చేరారని చెప్పారు.
చంద్రబాబులాంటి ముఖ్యమంత్రిని చూసి, ఏపీ ప్రజలు సిగ్గుపడాలని అన్నారు. ఏ మొహం పెట్టుకుని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని చెప్పారు. ఎన్నికల్లో తిరస్కరించిన జాతీయ పార్టీలకు ఇంకా బుద్ధి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారని… ఇప్పుడు మళ్లీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని… ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూశారని చెప్పారు.
ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నేతలు అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. మార్కెట్ కమిటీల్లో బీసీల రిజర్వేషన్లను తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.