Andhra Pradesh
నిలిచిపోయిన నిధులు…
ఆగిపోయిన కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు
విజయవాడ,డిసెంబర్ 28, (లోకల్ న్యూస్)
కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులకు మళ్లీ బ్రేక్ పడింది. అసలే సాగదీత అనుకుంటుంటే ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తోంది. కాంట్రాక్టు సంస్థ ‘సోమా ’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఫ్లై ఓవర్ పనులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6 కోట్ల బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్ పనులకు బిల్లు చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్రమో తెలియని స్థితి. వస్తాయనుకున్న ఎస్కలేషన్ చార్జీలు రూ. 4 కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి.
ఎవరైనా డబ్బులు ఇస్తే పని చేస్తారు.. మన ప్రజలే కదా అనుకుంటే, కొంత వరకు లాగగలరు. అక్కడా ఇక్కడా రొటేషన్ చేసి, ఎలాగొలా కొంత కాలం లాగుతారు. అయితే, ఎప్పటికైనా డబ్బులు వస్తాయేలే అనే ఆశతో అలా రిస్క్ తీసుకుంటారు. కాని అసలు డబ్బులే ఇవ్వకుండా, పని చెయ్యాలి అంటే ఎవరి వల్లా కాదు. విజయవాడలో ఇదే జరుగుతుంది. కేంద్రం టార్చర్ ఇలా ఉంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనకదుర్గా ఫ్లై ఓవర్ పనులకు బ్రేక్‌పడింది. అసలే సాగదీత అనుకుంటున్న పనులు ఇప్పుడు అసలే ఆగిపోయే పరిస్థితి నెలకొంది.
నాలుగు నెలలుగా జీతాలు అందుకోలేని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో దుర్గా ఫ్లై ఓవర్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జీతాలు చెల్లించలేని అసహాయతలో ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6కోట్ల బిల్లును పే అండ్ అక్కౌంట్స్ కమిటీ తిరస్కరించింది. చేసిన పనికి రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించటంతో ఇప్పట్లో ఈ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్ పనులకు సంబంధించి బిల్లు కూడా అనిశ్చితిలో పడింది.మరోవైపు వస్తాయనుకున్న ఎస్కలేషన్ ఛార్జీలు రూ.4కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో నిధుల వెసులుబాటుకు కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి.
జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చేసింది. నాలుగునెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో కార్మికులు రగిలిపోతున్నారు. కనకదుర్గా ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇటు ఫ్లైఓవర్ నిర్మాణం, అటు క్యాస్టింగ్ డిపోలో కలిపి మొత్తం 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా బీహార్, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి వచ్చి కుటుంబాలకు దూరంగా ఇక్కడ పనిచేస్తున్నారు. రోజుకు రెండు షిప్టులలో వీరు పనిచేస్తున్నారు. వీరికి సెప్టెంబరు మాసం నుంచి కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ వేతనాలను చెల్లించటం లేదు.
ఒక్కో కార్మికుడికి సగటున రూ. 10వేల నుంచి రూ.15 వేల వంతున చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోమా సంస్థ ప్రతినిథుల ఎదుట పలు దఫాలు కార్మికులు తాము సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని ఆందోళన చేశారు. ఒకానొక దశలో అల్టిమేటం కూడా ఇచ్చినట్టు తెలిసింది.చేతిలో పైసా లేకపోవటంతో సోమా సంస్థ కార్మికుల జీతాలను చెల్లించలేకపోయింది. దీంతో కార్మికులు మూకుమ్మడిగా సమ్మెలోకి దిగారు. సాయంత్రం కార్మికులను పిలిపించిన సోమా ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. రెండు నెలల వేతనాలను పండుగ లోపు అందిస్తామని సోమా ప్రతినిధులు కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనకు కొంతమంది కార్మికులు సుముఖత వ్యక్తంచేయగా.. మరికొంత మంది మాత్రం అంగీకరించలేదు.
కాంట్రాక్టు సంస్థ చేసిన పనికి రూ. 6 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు పే అండ్ అక్కౌంట్స్ కమిటీ దృష్టికి వెళ్ళగా తిరస్కరించింది. సంవత్సరాంతం కావటంతో పనులకు సంబంధించి రీ వాల్యుయేషన్‌చేసి పంపించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. రీవాల్యుయేషన్ చేసి పే అండ్ అక్కౌంట్స్‌కు పంపించటానికి చాలా సమయం పడుతుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయితే కానీ ఆ డబ్బులు రావు. ఇప్పటికే రాష్ట్రం తన వాటా కంటే, దాదాపు 50 శాతం ఖర్చు చేసింది. కేంద్రం మాత్రం, తన వాటాలో సగం కూడా విడుదల చెయ్యలేదు, పైగా డిజైన్ ల పై అభ్యంతరాలు చెప్తూ సాగాదీస్తుంది.