
Kalinga Times : గత నాలుగు దశాబ్దాలుగా, శంకర నేత్రాలయ లక్షలాది మంది కంటి చూపు లేని నిరుపేదలకు దృష్టిని పునరుద్ధరించిందని నిర్వాహకులు తెలిపారు. శంకర నేత్రాలయ అందించే ప్రత్యేక సేవలలో ఒకటి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (మేసు – మొబైల్ ఐ సర్జికల్ యూనిట్). ఈ రంగంలో రిమోట్ కంటి శస్త్రచికిత్సలు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏకైక సంస్థ శంకర నేత్రాలయ. మేసు అనేది రెండు ప్రత్యేక వాహనాలు కలిసి ఒక వైద్య శిబిరం గా మారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఉచిత కంటి చికిత్స చేస్తుంది. మేసు అనగా చక్రాలపై ఉన్న దవాఖాన రెండు బస్సులు కలిగి ఉంటుంది.
ఒకటి రోగి ప్రిపరేటరీ గదిగా మరొకటి ఆపరేషన్ థియేటర్గా పనిచేస్తుంది. ఈ బస్సులు దాదాపు 25 మంది వైద్య సిబ్బంది కలిసి మారుమూల గ్రామాలకు వెళ్లి, సుమారు 2,000 నుంచి 3,000 మంది రోగులను పరీక్షించి, రెండు వారాల వ్యవధిలో 150 నుంచి 300 మంది రోగులకు కంటిశుక్లం శస్త్రచికిత్స చేసి, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత తిరిగి బేస్ దవాఖానకు చేరుకుంటారు. వేరే కీలక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను బేస్ హాస్పిటల్కు పంపుతారు.
శంకర నేత్రాలయ యూఎస్ఏ అనేది శంకర నేత్రాలయ ఇండియా నిధుల సేకరణ విభాగం. ప్రతియేటా నిధులు సేకరించి భారతదేశంలో ఉన్న శంకర నేత్రాలయకు పంపుతుంది. ఇప్పటివరకు, రెండు మేసు విభాగాలు ఉన్నాయి. ఒకటి చెన్నైలో మరొకటి జార్ఖండ్లో జనవరి 2023 నుంచి మూడవ మేసు యూనిట్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏ. ఐ. జి. సంస్థ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారని నిర్వాహకులు తెలిపారు.
ఒక్కో మేసు యునిట్ బేస్ హాస్పిటల్ నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు వెళ్లి కంటి శుక్ల సేవలు నిర్వహిస్తుంది. దీంతో పూర్తి తెలంగాణ ప్రాంతానికి మేసు ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తుంది . 2023 నుంచి ఝార్ఖాండ్, హైదరాబాద్, చెన్నై నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఏ మారుమూల ప్రాంతానికైనా ఈ వసతి లభిస్తుంది.
శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి విదేశాలలో నివసిస్తున్న భారతీయులలో అడాప్ట్–ఎ–విలేజ్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సేవలు పెంచడానికి ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. అతని అమూల్యమైన సేవలకు ఆ సంస్థలో అత్యున్నత పురస్కారమైన శంకరరత్నను ప్రదానం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా – నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) కూడా ఇటీవల డల్లాస్లో నిర్వహించిన సమావేశంలో అతని అత్యుత్తమ సేవలను గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీ సర్వీస్ అవార్డును ప్రదానం చేసింది.
శంకర నేత్రాలయ గురించి అవగాహన పెంచడానికి, శంకర నేత్రాలయ యూఎస్ఏ జులై 1, 2023న నాటా కన్వెన్షన్లో ప్రముఖ వైద్యుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ ప్రేమ్ రెడ్డిరితో మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన ఇటీవల తన స్వస్థలమైన నెల్లూరు సమీపంలోని నిడిగుంటపాలెంలో స్పాన్సర్ చేసిన అడాప్ట్–ఎ–విలేజ్ కార్యక్రమం కంటి సమస్యలతో బాధ పడుతున్న వందలాది మంది పేద రోగుల చూపుని పునరుద్ధరించింది.
బాల ఇందుర్తి, కోర్ కమిటీ సభ్యులు ఆనంద్బాబు దాసరి, శ్రీధర్రెడ్డి తిక్కవరపులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శంకర నేత్రాలయ యు. యస్. ఏ. బృందం డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గాను ధీన బంధు పురస్కారంతో సత్కరించింది. ఈ సమావేశంలో, హైదరాబాద్, చెన్నై, జార్ఖండ్లలో 2023, 2024లో అడాప్ట్–ఎ–విలేజ్ కార్యక్రమానికి సహకరించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ జట్టు , మేసు దాతలను డాక్టర్ ప్రేమ్ రెడ్డి సత్కరించారు.
MESU అడాప్ట్–ఎ–విలేజ్ 2023 దాతలు: డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, రమేష్ రెడ్డి వల్లూరు, ప్రసాద్ రెడ్డి మల్లు, డాక్టర్ కిషోర్ రెడ్డి రాసమల్లు, రూబీ నహర్, ఆనంద్ బాబు దాసరి, MESU అడాప్ట్–ఎ–విలేజ్ 2024 దాతలు: మూర్తి రేకపల్లి, కిరణ్ రెడ్డి పాశం, కరుణాకర్ ఆసిరెడ్డి, కృష్ణదేవ్ రెడ్డి లట్టుపల్లి, డాక్టర్ చీమర్ల నరేందర్ రెడ్డి, రమేష్ చాపరాల, డాక్టర్ బాల్ టి. రెడ్డి, ఎ. జలంధర్ రెడ్డి, ప్రియా కొర్రపాటి , రవి రెడ్డి మరక, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, డా. మోహన్ మల్లం, నారాయణ రెడ్డి గండ్ర, తిరుమల రెడ్డి కుంభం, ప్రసూన దోర్నాదుల, మీనల్ సిన్హా BOXA, శ్రీని రెడ్డి వంగిమళ్ల, సతీష్ కుమార్ సెగు, రాజేష్ తడికమళ్ల, చైతన్య మండల, భాస్కర్ గంటి, బాల రెడ్డి ఇందుర్తి, నారాయణరెడ్డి ఇందుర్తి, రవి ఇందుర్తి.
ఈ కార్యక్రమానికి హాజరైన SNUSA ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీల బోర్డు, గత ధర్మకర్తల మండలి.. బాల రెడ్డి ఇందుర్తి (అధ్యక్షుడు), మూర్తి రేకపల్లి (వైస్ ప్రెసిడెంట్), శ్యామ్ అప్పాలి (జాయింట్ సెక్రటరీ), సోమ జగదీష్ (జాయింట్ ట్రెజరర్), ప్రసాద్ రాణి, శ్రీని రెడ్డి వంగిమళ్ల, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ఆనంద్ బాబు దాసరి, రాజశేఖర్ రెడ్డి ఐల, మెహర్ చంద్ లంక, డాక్టర్ జగన్నాథ్ వేదుల, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఏరువరం, రాజు పూసపాటి, వినోద్ పర్ణ, ప్రియా కొర్రపాటి, రమేష్ బాబు చాపరాల, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, రవి రెడ్డి మరక.
నిరుపేద రోగుల చూపుని పునరుద్ధరించే ఈ ఉదాత్త కార్యక్రమానికి ఇచ్చే మద్దతు అందరిచే మీట్ ‘n గ్రీట్లో ప్రశంసించబడింది. ఆ సమావేశంలో పలువురు దాతలు ముందుకు వచ్చి, అడాప్ట్–ఎ–విలేజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఉదాత్తమైన చేయూత పేద రోగుల జీవితాల్లో మార్పు తెస్తాయి. దీనికోసం పనిచేస్తున్న వాలంటీర్లకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.
వ్యవస్థాపకుడు SV ఆచార్య, SN ఇండియా వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ SS బద్రినాథ్ , చెన్నై నాయకత్వం డాక్టర్ గిరీష్ రావు, డాక్టర్ సురేంద్రన్, కన్నన్ నారాయణన్, రామచంద్రన్ గోపాలన్ , సురేష్ కుమార్ల నిరంతర మద్దతుకు కోర్ కమిటీ సభ్యులు బాలారెడ్డి ఇందుర్తి, ఆనంద్ బాబు దాసరి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పల్లి, వంశీ కృష్ణ ఏరువరం, సోమ జగదీష్, నారాయణరెడ్డి ఇందుర్తి, వినోద్ పర్ణ, మీనల్ సిన్హా, తీగరాజన్, దీనదయాళన్, కులతేజలకు ధన్యవాదాలు. దయచేసి మరిన్ని వివరాల కోసం www.Sankaranethralayausa.org ని సందర్శించండి పేద రోగుల దృష్టిని పునరుద్ధరించడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు.