Kalinga Times, Nirmal : డబుల్ బెడ్ రూం ఇళ్ళపై బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బిజెపి రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నేతలు సోమవారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి.
ఈ సంధర్భంగా బిజెపి ముధోల్ నియోజక్వర్గ ఇంచార్జ్ మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా పేద వాళ్ళకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కెసీఅర్ ప్రభుత్వం ఎనతమంది పేదలకు ఇళ్ళను మంజూరు చేశారో,ఎవరికి మంజూరు చేశారో నియోజకవర్గాల వారిగా దమ్ముంటే శాసన సభ్యులు పేదల ముందు చర్చకు రావాలని డిమాండ్ చేశారు..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆవాస్ యోజన క్రింద చాలామంది పేదలకు ఇళ్ళను మంజూరు చేసిందని ఆయన ఈ సంధర్భంగా గుర్తు చేశారు.మాటమీద నిలబడని ఇలాంటి ముఖ్యమంత్రిని వచ్చే ఎన్నికల్లో ఫాం హౌస్ కు సాగనంపాపాలని ప్రజలకు విన్నవించారు.కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిజెపిని గెలిపిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని తెలిపారు.
ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి.డబుల్ బెడ్ రూం కేటాయింపులో SC,ST,BC లకు జరగుతున్న అన్యాయాన్ని అరికట్టలన్నారు. అర్హులైన అభ్యర్థులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీ పేదల పక్షన పోరాడుతూనే ఉంటుందని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేసిన తరవాతనే స్థానిక ఎమ్మెల్యేలు ఓట్లు అడగడానికి గ్రామాలకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాస్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెద్ది,ఎలేటి మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్ మరియు జిల్ల బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.