Kalinga Times ,Nirmal : ముధోల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకొంటోంది..స్థానికంగా ఉన్న భోస్లే మోహన్ రావు పాటిల్ దూకుడు పెంచారు.అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమయ్యారు.ప్రతి రోజు నియోజక వర్గ వ్యాప్తంగా ఏదో ఒక చోట నిరసనలు,ధర్నాలు చేపడుతూ బిజెపి క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.
కెసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ళ విషయంలో ఆయన చేపడుతున్న ధర్నా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.ఇళ్ళ విషయంలో చాలా కుటుంబాలు ఆయన చేపట్టే కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. దీనితో ముధోల్ వ్యాప్తంగా ప్రజాభిమానాన్ని పొందడంలో భోస్లే మోహన్ రావు పాటిల్ సక్సెస్ అయ్యారు.
అయితే ముధోల్ నియోజక వర్గంలో బిజెపి టికెట్ కోసం ఇటీవలే పార్టీలో చేరిన రామారావు పాటిల్ బిజెపి రాష్ట్ర నేతలతో లాబీయింగ్ చేస్తున్నప్పటికి ముధోల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఏనాడు దృష్టి పెట్టలేదన్నది స్థానికుల అభిప్రాయం.
దీనితో పాటు నియోజకవర్గంలో బిజెపి నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు.అయినప్పటికి బిజెపి పార్టీ బలోపేతానికి భోస్లె మోహన్ రావు పాటిల్ కృషి చేస్తున్నారు .పార్టి ఆదేశాలమేరకు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా కార్యకర్తలను ఊత్తేజ పరిచేలా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారు.
నిత్యం ప్రజలతో ఉంటున్న మోహన్ రావు పాటిల్ కాదని మరొకరికి అవకాశం ఇస్తే ప్రజభీష్టాన్ని పార్టీ గుర్తించలేనట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అదే జరిగితే మోహన్ రావు పాటిల్ పై స్థానిక ప్రజలు పోటిలో నిలబడమని ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు.