Religious
ఫొటో గ్రాఫర్లను ఫ్రంట్ వారియర్లుగా గుర్తించి ఆర్థికంగా ప్యాకెజీ ప్రకటించాలి
మంచిర్యాల ఫొటో,వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అధ్యక్షులు నల్ల సతీష్ కుమార్

Umads Raju, Staff Reporter,Kalinga Times,Mancherial : కళారంగాలపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ఆర్థికంగా కోలుకోని దెబ్బతీసిందని మంచిర్యాల ఫొటో,వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అధ్యక్షులు నల్ల సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండు సంవత్సరాల కాలంలో ఉన్న కొన్ని శుభకార్యాల సమయంలోనే కరోనా విజృంభిచడం మూలంగా అంతంత మాత్రంగా లభించే ఆర్డర్లు మొత్తానికే లేకుండా పోయాయన్నారు.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటం,కరోనా నిబంధనలు కఠినతరంగా ఉన్న కారణంగా ప్రజలు శుభకార్యాలకు ఆసక్తి చూపలేదన్నారు.కొద్దిపాటిగా జరిగిన శుభకార్యాలలో ఫ్రొఫెషన్ల్ ఫోటో గ్రఫికి ప్రాధాన్యమివ్వకుండా చాలా తక్కువ బడ్జెట్ లో పెళ్ళి తంతు ముగించడంతో ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేకుండపోయిందన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కళా రంగంలో ప్రాధాన్యత పాత్ర పోషించే ఫొటోగ్రఫి రంగాన్ని ఎంచుకున్న ఫోటోగ్రాఫర్లను ఆదుకొవాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని నల్ల సతీష్ కుమార్ అన్నారు.లాక్ డౌన్ సమయంలో కుటుంబ పోషణ గగనంగా మారి చాలామంది ఫోటోగ్రాఫర్లు అప్పులపాలవుతున్నారని,మరికొందరు ఆత్మవిశ్వాసం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వాపోయారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇబ్బందులను గుర్తించి ఫొటో గ్రాఫర్లను ఫ్రంట్ వారియర్లుగా గుర్తించి ఆర్థికంగా ప్యాకెజీ ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.