social

బిసిలకు అధికారం లభించకపోతే బావి తరాల భవిష్యత్ అంధకారం

పరికిపండ్ల నరహరి ఐ.ఎ.ఎస్

బిసిలకు అధికారం లభించకపోతే బావి తరాల భవిష్యత్ అంధకారంగా మారుతుందని పరికిపండ్ల నరహరి ఐ.ఎ.ఎస్ ఆంధోళన వ్యక్తం చేశారు.

Kalinga Times, Hyderabad : ఆదివారం జన అధికార సమితి కార్యవర్గ సభ్యులు మంతెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిసి ఎ కులాల ప్రతినిధులతో వెబినార్ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పరికిపండ్ల నరహరి పాల్గొని ప్రసంగించారు.ముందుగా బిసి ఎ కు సంబందించిన నాయీబ్రాహ్మణ,గంగపుత్ర,బెస్త,రజక,మేదరి,వడ్డెర,బోయ,సంచారజాతుల ప్రతినిధులు వారికి ఎదురవుతున్న పలు సమస్యలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.ముఖ్యంగా నిధుల మళ్ళింపు,విద్య వివక్ష,కులవృత్తుల నిరాదరణ,ఉపాధి లేమి,తదితరాలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరుపై మండిపడ్డారు.వెనుకబడిన కులాలకు ఉన్నత విద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులు అనివార్యమని తెలిపారు.బిసి కులాల వర్గీకరణ జరిగితేనే సమాన అవకాశాలకు ఆస్కారం ఉంటుందని ఆ దిశగా నరహరి ఐ.ఎ.ఎస్ కార్యచరణ రూపొందిస్తే తామంతా కలసి సాగుతామని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.అనంతరం నరహరి ఐ.ఎ.ఎస్ మాట్లాడుతూ బిసి ల సంఘటితానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.బిసిల విద్యా వికాసానికి అందరం కలసి పనిచేద్దామని తెలిపారు.తెలుగు రాష్ట్రాలలో బిసిలను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఉన్న రుగ్మతల పట్ల ఖచ్చితమైన కార్యాచరణ త్వరలోనే చేపడదామని దానికి అందరం సంఘటితం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాదరబోయిన నర్సయ్య,రజక రిజర్వేషన్ గోపి,పిళ్ళి రాజమౌళి,అబ్బులింగం,శ్రీనివాస్లతో పాటు జన అధికార సమితి కార్యవర్గ సభ్యులు మంతెన శ్రీనివాస్,సిలివేరు గణేష్,ప్రయకరావ్ కృష్ణమూర్తి ,కీర్తి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close