Religious

కరోనా వైరస్ నేపథ్యంలో పరికిపండ్ల నరహరి, సీనియర్ ఐఏఎస్ మనోగతం

పరికిపండ్ల నరహరి, సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ ప్రభుత్వంలో కరోనా రెండవ వేవ్ ని ఎదుర్కోవటం కోసం ఆక్సిజన్ మానేజ్మెంట్ టీంలో ఉన్నారు

 కరోనా వైరస్ నేపథ్యంలో Kalinga Times తో ఆయన మనోగతం
కరోనా రెండవ వేవ్ (మార్చి- మే 2021) విలయతాండవం చేస్తోంది. జనాలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. కరోనా కేసులు పెరిగి పెద్దవాడు, చిన్న వాడు, డబ్బు ఉన్నవాడు, లేనివాడు అందరూ సమానంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ ప్రభావితులై ఉన్నారు. ముందు ఆస్పత్రులలో కరోనా టెస్టుల కోసం, ఆ తరువాత బెడ్స్ కోసం, ఆ తరువాత ఆక్సిజన్ కోసం, ఆ తరవత మెడిసిన్స్ కోసం ప్రజలు అల్లకల్లోలమై అష్టకష్టాలు పడుతున్నారు.పేదవాడు కనీసం ఆస్పత్రులకు కూడా చేరుకోలేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. మన దేశ జనాభాకు అనుగుణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రామాలలో  ఆస్పత్రులు లేకపోవడం అదే విధంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ లాబరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితులను చూస్తున్నాము.
అసలేం జరిగింది? ఎక్కడ అభివృద్ధి? 
మన తెలుగు రాష్ట్రాలలో విద్య మరియు వైద్య రంగాలలో అభివృద్ధి లేకుండా మరి బడ్జెట్ల కేటాయింపు ఎటు పోయినాయి.? ఎక్కడ తప్పిదాలు జరిగినాయి? మనం ఈరోజు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? విద్య మరియు వైద్య రంగాలపై సగటున ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి? ఒక్కసారి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా గత కొన్ని సంవత్సరాలు ఈ రెండు క్షేత్రాలలో ఎంత బడ్జెట్ కేటాయించింది చూసుకున్నట్లయితే సగటున కనీసం 3% కూడా లేదు! ఎందుకిలా! అసలు ఆరోగ్యం మరియు విద్యకు  సంబంధించిన వరకు ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నడూ పెద్ద పీట ఎందుకు వేయడం లేదు? ఎందుకీ మానవ అత్యధిక అవసరాల  విభాగాల పైన ఇలాంటి చులకన చూపు?
సరే ఇప్పటికైనా, ఇకముందైనా ప్రభుత్వాలు మేల్కొంటాయా? ముందు ఎన్నడూ ప్రభుత్వాలు ఈ రెండు శాఖలపై పట్టించుకోలేదు, మరి ప్రభుత్వాలు ఇంతటి ముఖ్యమైనటువంటి శాఖలను వదిలేసి బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది? ఎలాంటి శాఖలకు ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి?
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ఖర్చు సంక్షేమ పథకాల పేరుతో రాయితీలు పెన్షన్లు, స్టైపెండ్లు, ఇంట్లో కూర్చుండబెట్టి జీత భత్యాలు ఇవ్వడం లాంటి అనవసరపు ఖర్చులతో ప్రజలను సోమరిపోతులను చేయడం జరుగుతోంది. ఈ విధంగా విద్య వైద్య రంగాలను విస్మరించి, ఎందుకిలా తప్పుదోవ పట్టడం జరిగింది? దీనికి ప్రజలు కారణమా, లేక ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు కారణమా?
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో ఇంత ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు కనీసం ఇప్పుడైనా మేల్కొని విద్య వైద్య రంగాలకు అత్యధిక బడ్జెట్ కేటాయించే విధంగా  గొంతు ఎత్తుతారా? ప్రజా సంఘాలు, విద్యావంతులు కనీసం ఇకనైనా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తారా? మీడియా ఇకనైనా ప్రజల్ని ఆలోచింపజేస్తుందా?
డబ్ల్యూహచ్వో ప్రకారం భారతదేశంలో సగటున వైద్యం మీద భారత ప్రభుత్వం 1.5% జీడీపీ ఖర్చు చేస్తుంది. అదే అమెరికా 17% తామ జీడీపీ ఖర్చు చేస్తుంది. సగటున ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో? వరల్డ్ బ్యాంకు ప్రకారం భారత దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభా కి కేవలం 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అదే చైనా లో 4.3 బెడ్స్ ఉన్నాయి. అసలు దీంట్లోంచి ఎన్ని ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయో తెలీదు! భారత దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభా కి కేవలం 0.9 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అదే చైనా లో 2.0 డాక్టర్లు ఉన్నారు.
మన దేశంలో ఫార్మసీ ఇండస్ట్రీని కూడా ఏంతో ప్రోత్సహించాలి. కరోనా మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడాలంటే మందులు కూడా సకాలంలో దొరకాలి. ఈ రెండవ వేవ్ లో మనం చూసిందేమిటంటే ఎన్నో రకాల మందులు అసలు మన దేశంలోనే తయారు కావడం లేదు. రెమెడీసీవీర్, తోసిలీజుమాబ్ లాంటి ఇంజెక్షన్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డామో? అదే విధంగా వ్యాక్సిన్లు తయారు చేసే కంపనీలు కేవలం కొన్ని సిటీలలోనే ఉన్నాయి. ఇకనైనా ఫార్మసీ కంపెనీలని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. మందులు తయారు చేసే కంపెనీలకు తక్కువధరకు భూమి, కంపెనీ పెట్టడానికి రియయితీలు ఇవ్వాలి.
ప్రజలకు చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి, అన్న మేధావుల మాట కనీసం ఇప్పుడైనా సాకారం అవుతుందా? కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు మేల్కొని గ్రామ గ్రామానికి అత్యాధునిక మైనటువంటి సదుపాయాలు కలిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపిస్తారా? ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనీసం కరోనాని ఎదుర్కొనే విధంగా తగు సదుపాయాలతో అభివృద్ధి బాటలో కి ప్రజల్ని తీసుకెళ్తుందా? 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close