Telangana
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం
మంచిర్యాల ఎ.సి.పి అఖిల్ మహాజన్

Umaads Raju ,Staff Reporter, Kalinga Times,Mancherial : కరోనా విజృంబిస్తున్న నేపద్యంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంచిర్యాల ఎ.సి.పి అఖిల్ మహాజన్ హెచ్చరించారు.శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్,గర్మిల్లా కాలనీలలో మంచిర్యాల సి.ఐ ముత్తు లింగయ్య,నస్పూర్ సి.ఐ కుమారస్వామి మరియు మంచిర్యాల ఎస్.ఐ ప్రవీణ్ లతో కలసి పెట్రోలింగ్ నిర్వహించారు.
ఈ సంధర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన పలువురిని అడ్డుకుని విచారించారు.మరొసారి లాక్ డౌన్ లో పట్టుబడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించి వదిలిపెట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ దయచేసి ఎవారూ లాక్ డౌన్ సమయంలో బయటకు రావద్దని సూచించారు.అత్యవసరమైతే ఇ-పాస్ తీసుకుని బయటకు రావాలన్నారు.లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.