Telangana
వ్యక్తులు కాదు ముఖ్యం!విలువలు,సిద్ధాంతాలు ముఖ్యం!
జక్కే.వీరస్వామిగౌడ్ , రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము.

కళింగ టైమ్స్, జమ్మికుంట: వాడు కాకపోతే వీడు!వీడు కాకపోతే వాడు! అంటూ దశాబ్దాల కాలంగా మానసిక వైరాగ్యంలో మన బహుజన సమాజం ఉంది! వ్యాపారస్తుడు స్వార్ధ పరుడు అగ్రవర్ణ కుల బావజాలాలు బలంగా వుండి రాజకీయాల్లో ఎదిగితే తన స్వార్థ ప్రయోజనాల కొరకు మరిన్ని ఆస్తులు కూడా పెడతాడు తప్ప,నమ్మిన వర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర లేదు! విశ్వాసాలను పక్కన బెట్టి విధాన రాజకీయాలపై సమకాలీన రాజకీయాలపై చర్చిచండి!తన వ్యక్తి గత ప్రయోజనాల కొరకు ఎలక్షన్ ముందు ఎమోషనల్ స్పీచ్ తో కులం కార్డ్ వాడుకొని ఎదిగిన వారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదనేది జగమెరిగిన సత్యం!అందుకే బహుజన సమాజాన్ని వాడుకొని వదిలేసిన నాయకులే 99 శాతం ఉన్నారనేది నాటి నుండి నేటి రాజకీయాల వరకు చూస్తేనే తెలుస్తున్నాయి! ఈ విషయం పై బడుగు బలహీన వర్గాల మేధావులు విద్యావంతులు చాలా లోతుగా విశ్లేషణ చేయాలి.