Telangana
తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేపీ కార్యకర్తల నిరసన

కళింగ టైమ్స్: గోదావరిఖని,
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, నాయకులు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసుల పై దాడి చేసి దహనం చేయడం కాకుండా అమాయక బీజేపీ కార్యకర్తలను చంపి వేయడం అభం శుభం తెలియని మహిళాల పై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు కోవిడు నిబంధనలు పాటిస్తూ భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండెబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో లో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం జరిగింది కానీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఎదుగుదలను ఓర్వలేక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా పనిచేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మహిళా కార్యకర్తలపై అత్యాచారం చేయడం దాదాపు 30 మంది కార్యకర్తలను చంపేయడం జరిగిందని,ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అదే విధంగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా రాష్ట్రపతి సుమోటోగా స్వీకరించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమాయక ప్రజలు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో బ్రతకడం జరుగుతుందాని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ డిమాండ్ చేస్తుంది, ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి తడగొండనరసయ్య, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు సీతా కారి చంద్రశేఖర్, కార్పొరేషన్ కార్యదర్శి గుండెబోయిన భూమయ్య, బీజేవైఎం కార్పొరేషన్ అధ్యక్షులు కాంపల్లి రఘు, చుక్కల రాములు, విశ్వనాథ్, బుర్ర రాజు గౌడ్, తిరుమల రావు, రవికుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది