Telangana
శ్రీ త్రిలింగా రాజరాజేశ్వరా స్వామి దేవాలయంలో స్వామికి అభిషేకం
జనగామలో 108 కొబ్బరికాయలతో స్వామి వారికి అభిషేకం

కళింగ టైమ్స్ : గోదావరిఖని,
గురువారం రోజు స్థానిక 9వ.డివిజన్ జనగామ శ్రీ లింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్,కుటుంబం కరోన మహమ్మారి వైరస్ నుండి త్వరగా కోలుకోవాలని, స్థానిక 9వ.డివిజన్ జనగామ శ్రీ త్రిలింగా రాజరాజేశ్వరా స్వామి దేవాలయంలో, 108 కొబ్బరికాయలతో స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. ఈట్టి కార్యక్రమంలో 9వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తజోద్దీన్ బాబా, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి జనగామ శివ, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు చెలుకల శ్రీనివాస్ యాదవ్, పులి వెంకటేశ్వర్లు, ఆత్రం రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.