Telangana
45వ.డివిజన్లో కళ్యాణలక్ష్మీ, షాధిముబారక్ చెక్కులు పంపిణీ

కలింగ టైమ్స్ గోదావరిఖని,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక 45వ. డివిజన్ లోని నిరుపేద ఆడపడుచులకు వరంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా 1,00,116 /- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.అందులో భాగంగా గురువారం రోజు 45వ.డివిజన్ లోని ఇద్దరికి కళ్యాణలక్ష్మీ, ఒకరికి షాధిముబారక్ చెక్కులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ,మేయర్ బంగి అనిల్ కుమార్ ,డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, రామగుండం తహసీల్దార్ రవీందర్, 45 వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు ఆధ్వర్యంలో….రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.