Telangana
ఎన్టిపీసి కాంట్రాక్ట్ కార్మికుల కొత్త మెడికల్ విధానం రద్దు

కళింగ టైమ్స్ జ్యోతి నగర్: ఎన్టిపీసి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న మెడికల్ టెస్ట్ ఇకనుండి రద్దు చేయాలని, ఎన్టిపీసి జనరల్ మేనేజర్ (ఓ&ఎం) వద్ద మంగళవారం రోజు ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి ఆధ్వర్యంలో… సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మెడికల్ కొత్త విధానాన్ని కొనసాగించకుండా, పాత పద్ధతి ద్వారా కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. సాయంత్రం ఐదు గంటలకి ఎన్టిపీసి హాస్పటల్లో సీఎం తో పాత విధానాన్ని కొనసాగించాలని, చెప్పడంతో సీ.ఎం.ఓ సానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది. ఇకనుండి ఎన్టిపీసి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండానే విధులలో కొనసాగించుటకు ఒప్పుకోవడం జరిగింది. నిర్ణయానికి సహకరించిన జనరల్ మేనేజర్ (ఓ&ఎం)కి, సి.ఎం.ఓ కి, ఈ విధానాన్ని ఎన్టిపిసి యాజమాన్యంతో మాట్లాడి, గుర్తించినందుకు గాను ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషాకి, ఎన్టిపీసి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున భూమల్ల చందర్ కృతజ్ఞతలు తెలియజేశారు.