Telangana
బొగ్గు గనులపై, కరోనా వైరస్ పట్ల అవగాహన సదస్సు.

కళింగ టైమ్స్ , లక్ష్మి నగర్ : రామగుండం రీజియన్-1, జీడికే 11ఇంక్లైన్ గనిలో కరోనా వైరస్, కరోనా టీకాల పై అవగాహన సదస్సును డాక్టర్ పద్మ హెల్త్ ఆఫీసర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన ఆహార నియమాలు గురించి వివరించారు. వైద్య ,వ్యక్తిగత రక్షణ విషయాలపట్ల కార్మికులకు అవగాహన కల్పించారు. కరోనా మళ్లీ విజృంభిస్తుంది ప్రతి ఒక్కరు మాస్కు, తప్పనిసరిగా ధరించాలి ఉద్యోగులు తప్పనిసరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని, పేర్కొన్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం కరోనా టీ కా ఉచితంగా ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేశామన్నారు. కరోనా టిక పై అపోహలు నమ్మవద్దని, చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ పి. శ్రీనివాస్, మేనేజర్ ఎ. నెహ్రూ, సేఫ్టీ ఆఫీసర్ కే సురేష్ కుమార్ , పిట్ సెక్రటరీ శంకర్, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, సూపర్వైజర్స్, టెక్నీషియన్స్, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.